How to Start Coconut Business / టెంకాయల వ్యాపారం / Business Ideas in Telugu
టెంకాయల వ్యాపారం అనేది ప్రస్తుత రోజుల్లో చాలా డిమాండ్ ఉన్న బిజినెస్.
ప్రతిరోజు ఎంతోమంది గుడికి వెళుతూ ఉంటారు. గుడికి వెళ్లే చాలామంది టెంకాయలను తీసుకొని వెళ్తారు.
అలాగే ప్రతి ఫంక్షన్ కి, పూజలకు టెంకాయలను వాడుతారు.
అందువల్ల ఈ టెంకాయల వ్యాపారం చేయడం వల్ల మంచి ఆదాయం లభిస్తుంది.
సంవత్సరం మొత్తం నడిచే ఈ టెంకాయల బిజినెస్ కు మంచి ఆదాయం లభిస్తుంది.
ఈ వ్యాపారం చేయడం వల్ల మనకు నెలకు 50, 000 రూపాయలకు మించి సంపాదించుకోవచ్చు.
వ్యాపారం ఎలా చేయాలో చూద్దాం
ప్రతి గుడి దగ్గర టెంకాయలు అమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు.
మనము ఉండే విలేజ్ లో టెంకాయలు Wholesale గా ఎక్కడ ఇస్తారో తెలుసుకొని, ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం ద్వారా వారు మనకు తక్కువ రేట్ లో టెంకాయలు ఇస్తారు.
ఈ విధంగా తీసుకువచ్చిన టెంకాయలను మనము కిరాణా షాపులో, గుడి దగ్గర అమ్మే వాళ్ళకి, చిన్న చిన్న పట్టణాలకు సప్లై చేయడం ద్వారా మనకు మంచి ఆదాయం లభిస్తుంది.